Tuesday, March 26, 2024

సన్‌రైజర్స్‌కు కొత్త జెర్సీ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌–2023 సీజన్‌ కోసం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నది. రాబోయే సీజన్‌కు సంబంధించి జెర్సీని ఆవిష్కరించింది. మయాంక్‌ అగర్వాల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కొత్త జెర్సీతో ఉన్న వీడియోను ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. పాత ఆరెంజ్‌ ఆర్మీ జెర్సీలో సమూలమైన మార్పులు చేయకుండా, ఈస్ట్రన్‌ కేప్‌ జెర్సీని పోలినట్టుగా ఉండే ఆరెంజ్‌ జెర్సీపై నల్లరంగును అద్దింది.

కాగా, సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ఏప్రిల్‌ 2న హైదరాబాద్‌ వేదికగా రాజస్థాన్‌తో తలపడనున్నది. గత సీజన్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆరు విజయాలు, ఎనిమిది ఓటములతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఈసారి కెప్టెన్‌గా ఐడెన్‌ మార్క్రమ్‌ వ్యవహరిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement