Monday, March 25, 2024

వాట్సాప్​లో కొత్త ఫీచర్లు.. అనుచిత స్టేటస్​లపై కంప్లెయింట్​ చేయొచ్చు!

మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌కు కొత్త ఫీచ‌ర్లు అందుబాటులోకి తెస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ తోపాటు డెస్క్‌టాప్ వ‌ర్ష‌న్‌కూ కొత్త అప్‌డేట్స్ రిలీజ్​ చేయబోతున్నట్టు తెలిపింది. డిలిటెడ్ మెసేజ్‌ల‌ను అన్‌డూ చేయ‌డంతోపాటు న‌చ్చ‌ని స్టేట‌స్‌ల‌పై యూజ‌ర్లు ఫిర్యాదు చేసేందుకు వీలుగా వాట్సాప్ కొత్త ఆప్ష‌న్లు తెనుంది. మ‌రొక డివైజ్‌లో లాగిన్ కావ‌డానికి కోడ్ న‌మోదు ఫీచ‌ర్ కూడా రాబోతోంది. వాట్సాప్ కాంటాక్ట్స్‌ల్లో రోజూ స్టేట‌స్‌లు పెడ‌తారు. సినిమా పాట‌లు, కొటేష‌న్లు, ఫ‌న్నీ వీడియోల వ‌ర‌కు ఓకే.. కొన్ని స్టేట‌స్‌లు అంద‌రికి న‌చ్చ‌వు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌చ్చ‌ని స్టేట‌స్‌ల గురించి వాట్సాప్‌లో ఏమీ చేయ‌లేం. కానీ ఇక ముందు అట్లా కాదు.. అనుచిత స్టేట‌స్ గురించి వాట్సాప్ మోడ‌రేస‌న్ టీమ్‌కు కంప్లెయింట్​ చేయొచ్చు. ప్ర‌స్తుతం డెవ‌ల‌ప్‌మెంట్ ద‌శ‌లో ఉన్న ఈ ఫీచ‌ర్ తొలుత డెస్క్‌టాప్ బీటా వ‌ర్ష‌న్‌గా ఎంపిక చేసిన కొంద‌రికి మాత్రమే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆండ్రాయిడ్ యూజ‌ర్లు మ‌రో డివైజ్‌లో త‌మ వాట్సాప్ లాగ్ఇన్ కావాలంటే క్యూఆర్ డిజిట్ల కోడ్ న‌మోదు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అవుతుంది. మ‌రో డివైజ్‌లో లాగిన్ కావ‌డానికి య‌త్నించిన‌ప్పుడ‌ల్లా సంబంధిత యూజ‌ర్ మొబైల్‌కు ఆరు నంబ‌ర్ల వెరిఫికేష‌న్ కోడ్ వ‌స్తుంది. ఆ కోడ్ న‌మోదు చేస్తేనే మ‌రో డివైజ్‌లో వాట్సాప్ లాగిన్ అవుతుంది. ఈ ఫీచ‌ర్ కూడా ఇప్పుడు డెవ‌ల‌ప్‌మెంట్ ద‌శ‌లో ఉంది. తొలుత ఆండ్రాయిడ్ బీటా వ‌ర్ష‌న్ వాడేవారికి ఇది అందుబాటులోకి వ‌స్తుంది.

- Advertisement -

ఇప్పుడు వాట్సాప్‌లో చాలా మంది మెసేజ్ డిలిట్ ఫీచ‌ర్ ఇష్ట‌ప‌డుతుంటారు. త‌ప్పులు దొర్లిన మెసేజ్‌ను వెంట‌నే డిలిట్ చేయొచ్చు. కానీ, డిలిట్ ఫీచ‌ర్‌లో డిలిట్ ఫ‌ర్ ఎవిరీ వ‌న్‌, డిలిట్ ఫ‌ర్ మీ అనే రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. డిలిట్ ఫ‌ర్ ఎవిరీ వ‌న్ ఫీచ‌ర్ నొక్కితే సంబంధిత యూజ‌ర్ పంపిన కాంటాక్ట్స్ అంద‌రి ఫోన్ల‌లో మెసేజ్ డిలిట్ అవుతుంది. అలా కాకుండా తొలుత డిలిట్ ఫ‌ర్ మీ ఆప్ష‌న్ ఎంచుకుంటే మెసేజ్ పంపిన వారికి మాత్ర‌మే డిలిట్ అవుతుంది.

వాట్సాప్ యూజ‌ర్లు కొన్ని సంద‌ర్భాల్లో డిలిట్ ఫ‌ర్ ఎవిరీవ‌న్‌కు బ‌దులు డిలిట్ ఫ‌ర్ మీ ఆప్ష‌న్ నొక్కుతారు. దానివ‌ల్ల డిలిట్ ఫ‌ర్ ఎవిరీవ‌న్ ఆప్ష‌న్ వాడే చాన్స్ మిస్స‌యిన‌ట్లే. కానీ, ఇప్పుడు ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి వాట్సాప్ పూనుకున్న‌ద‌ని స‌మాచారం. ఒక‌వేళ పొర‌పాటున డిలిట్ ఫ‌ర్ మీ ద్వారా.. డిలిట్ అయిన మెసేజ్‌ల‌ను అన్‌డూ ఆప్ష‌న్ ద్వారా పున‌రుద్ధ‌రించుకుని.. అటుపై డిలిట్ ఫ‌ర్ ఎవిరీవ‌న్ ఆప్ష‌న్ వాడొచ్చు. అదే జ‌రిగితే ప‌లువురు యూజ‌ర్ల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని స‌ద‌రు ఫీచ‌ర్ డెవ‌ల‌ప‌ర్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement