Friday, March 29, 2024

న్యూ డే.. న్యూ మీ.. ద‌స‌రా షూట్ కంప్లీట్.. నాని

New Day.. New Me అంటూ క్యాప్షన్ పెట్టి క్లీన్‌ షేవ్‌తో ఉన్న మిర్రర్‌ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు నేచుర‌ల్ స్టార్ హీరో నాని. ఎపిక్ మూవీ దసరా షూటింగ్ పూర్తయిందని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. డైమండ్ లాంటి సినిమా ఎప్పుడూ ప్రకాశిస్తుంది’ అని పోస్టు చేస్తూ చిన్న వీడియో గ్లింప్స్ షేర్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా కోసం నాని మాస్‌ అవతారంలో పూర్తిగా మేకోవర్‌ అయ్యారు. ఈ వీడియో షేర్‌ చేసిన కొన్ని క్షణాలకే గడ్డం, మీసం తీసేసి లవర్‌ బాయ్‌ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. ఈ లుక్‌ నాని తదుపరి సినిమా కోసమే అంటూ పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు.అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement