Thursday, April 18, 2024

పెళ్లి కాని ఆడపిల్లల కోసం ‘ఆటా-సాటా’ అనే వింత సంప్రదాయం

రాజస్థాన్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ‘ఆటా-సాటా’ అనే వింత సంప్రదాయం వెలుగు చూసింది. ఈ ఆచారమే ఆమె మరణానికి కారణమని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రంలో ఆడవారి సంఖ్య తగ్గిపోయి, చాలా మంది అబ్బాయిలకు పెళ్లిళ్లు కరువైపోతున్నాయి.

తాజాగా వెలుగుచూసిన ‘ఆటా-సాటా’ అనే సంప్రదాయం ప్రకారం… ఏ అబ్బాయైనా పెళ్లి చేసుకుంటుంటే.. తమ ఇంట్లోని అమ్మాయిని వధువు కుటుంబంలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. అంటే పెళ్లి కొడుకు అక్కకో చెల్లికో.. పెళ్లి కూతురి కుటుంబంలో పెళ్లి చేయాలి. అలా చేయకపోతే అతని పెళ్లి కూడా జరగదు. ఇలా పెళ్లిళ్లు చేసే సమయంలో వయసులో ఎక్కువ తక్కువలను ఆ కుటుంబాలు పెద్దగా పట్టించుకోవడం జరగదు. ఇలా తనకు 70 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించడంతో అది ఇష్టం లేని ఒక 21 ఏళ్ల యువతి ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది.

ఈ వార్త కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ లాక్‌డౌన్

Advertisement

తాజా వార్తలు

Advertisement