Sunday, October 13, 2024

New Boss – ట్విట్టర్ నూతన సీఈఓ గా లిండా యక్కరినో బాధ్యతలు

కాలిఫోర్నియా – ట్విట్టర్ నూతన సీఈఓ గా లిండా యక్కరినో బాధ్యతలు చేపట్టారు.తాను ట్విటర్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించినట్టు లిండా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ట్విట్టర్ భవిష్యత్తు గురించి తాను పాటుపడడానికి ఎలాన్ మస్క్ నుండి ప్రేరణ పొందినట్టుగా లిండా యక్కరినో వెల్లడించారు. ఎలాన్ మస్క్ దూరదృష్టి తనను ఎంతో ఆకర్షించింది అని ఆమె తెలిపారు. ట్విట్టర్ ను అభివృద్ధి బాటలో నడపడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు.

లిండా ఇంతకుముందు ఎన్బీసీ యూనివర్సల్ కి ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.ఎన్బీసీ లో ఆమె ప్రకటనల విభాగానికి డిపార్ట్మెంట్ హెడ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మే నెలలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొత్త సిఈఓగా లిండా యక్కరినో పేరును ప్రకటించారు. అయితే ఆమె ఈ రోజు అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement