Friday, April 19, 2024

ఇంత దుర్మార్గమైన సీఎంను ఇంతవరకు చూడలే : అచ్చెన్నాయుడు

కడప బ్యూరో (ప్రభు న్యూస్) : స్వాతంత్రం వచ్చిన తరువాత 1953 నుంచి ఇంత దుర్మార్గుడు ఎప్పుడూ ముఖ్యమంత్రి కాలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన సీఎం అయ్యాక రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉండకూడదని మదమెక్కి నాలుగేళ్లు పైత్యంతో ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం కడపలో కడప అనంతపురం కర్నూలు ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ జూన్ 5 సమావేశం జరిగింది. అట్టహాసంగా ప్రారంభమైన ఈ సమావేశ ప్రారంభంలో పలువురు నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు.. వైసీపీ లాగా తెలుగుదేశం పార్టీ గాలికి పెట్టిన పార్టీ కాదని, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్ టీ రామారావు స్థాపించిన పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దెబ్బతీయడం నీ తండ్రి వల్లగాని, నీ వల్ల గాని కాదన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించాక 22 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ తెలుగుదేశం అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను వేధిస్తూ ఉన్నావని అన్నారు. రేపు గాని ఎల్లుండి గాని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అందుకు కారణం అవుతున్న కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఇడుపులపాయలో నోట్ల కట్టలు పాతిపెట్టారని, ఆ కట్టలు ఎన్నికలప్పుడు బయటకు తీసి గెలవాలనుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో కోడి కత్తి ద్వారా సానుభూతి పొందాలనుకుంటే కుదరక, సొంత బాబాయిని చంపి జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చారని ఆరాపించారు.


అధికారం వచ్చాక ఆరునెల‌లు ప్రతీకారమే!
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలు పార్టీ కార్యకర్తలను నాయకులను వేధించిన వారిపై ప్రతీకారం తీసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు అన్నారు. ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారు.. దౌర్జన్యాలకు పాల్పడ్డారు.. ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వారి పేర్లు రాసుకుని ఉండాలని.. అలాంటి వారిని వదిలి పెట్టేది లేదు అన్నారు. ఇబ్బంది పెట్టిన అధికారులు, అధికారులను కూడా వదిలేది లేదన్నారు. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను గుర్తు పెట్టుకొని కచ్చితంగా ప్రాధాన్యమిస్తామని, లేకపోతే మమ్మల్ని నిలదీయండి అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోమెంటు చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పురిటిమీద సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement