Thursday, April 25, 2024

ప్లేస్ ఏదైనా… నేను రెడీ అంటున్న వైసీపీ -ఫన్నీ వీడియో

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో వైసీపీ విజయ కేతనం ఎగుర వేస్తుంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా వైసిపి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కొన్ని చోట్ల మినహా టిడిపి ప్రభావం కూడా పెద్దగా చూపలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ స్టార్ట్ చేశారు. టిడిపి వైసిపి పార్టీ లకు రకరకాల ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమా లో ఓ ఫైట్ సీన్ ను టిడిపి వైసిపి గా క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. అందులో అల్లు అర్జున్ ను వైసిపి గా చూపిస్తూ… విలన్ ను టిడిపి చూపించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి…

Advertisement

తాజా వార్తలు

Advertisement