Sunday, March 24, 2024

రిలీజ్ కి ముందే ఓటీటీ హ‌క్కులు.. నెట్ ఫ్లిక్స్ లో భోళాశంక‌ర్

మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం భోళా శంక‌ర్.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మహానటి కీర్తి సురేశ్‌ చిరు చెల్లెలిగా నటిస్తోంది. ఏప్రిల్ 14న ఈ మెగా మూవీని విడుదల చేయనున్నట్లు గతేడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే భోళా శంకర్‌ ఓటీటీ పార్ట్‌నర్‌ అప్పుడే ఫిక్స్‌ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనుంది. దీనికి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు తమ ఓటీటీలోనే రిలీజ్ కాబోతున్నాయని ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ భోళా శంకర్ పోస్టర్ ని కూడా షేర్ చేసింది. ఏప్రిల్‌ 14న థియేట్రికల్ రిలీజ్ తర్వాత తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం భాషల్లో మెగా సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే హఠాత్తుగా ఈ పోస్టర్ చూసిన చాలామంది భోళాశంకర్‌ డైరెక్ట్ ఓటీటీలో వస్తుందేమోనని కంగారు పడ్డారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి రిలాక్స్‌ అయ్యారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement