Saturday, October 12, 2024

బాక్సింగ్‌ ఫైనల్స్‌లో నీతు, నిఖత్‌

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణుల జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లలో స్టార్‌ బాక్సర్లు నీతు, నిఖత్‌ జరీనా విజయం సాధించి ఫైనల్‌ బెర్తులు ఖాయం చేసుకున్నారు. ఊహించినట్లుగానే నిఖత్‌ మరోసారి సెమీస్‌లో 5-0తో అద్భుత విజయాన్ని అందుకుంది. కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిత్‌ వాలెన్సికా (50కేజీలు)ను ఓడించింది. అదే సమయంలో 48 కేజీల విభాగంలో కజకిస్తాన్‌ బాక్సర్‌ అలూ బాల్కిబెకోవాను నీతు మట్టికరిపించింది. 5-2తో విజయం సాధించింది.

గురువారం నాటి మ్యాచ్‌లో మూడు వరుస రిఫరీ స్టాప్స్‌ కాంటెస్ట్‌ పాయింట్లను సొంతం చేసుకున్న నీతు తన జైత్రయాత్రను కొనసాగించింది. ఆసియన్‌ చాంపియన్‌షిప్‌ విజేత బాల్కిబెకోవాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. గతేడాది క్వార్టర్‌ ఫైనల్‌లో కజక్‌ బాక్సర్‌ చేతిలో ఖంగుతున్న నీతు, ఈసారి దానికి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో 2022 ఆసియన్‌ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత మంగోలియా బాక్సర్‌ లుత్సాయిఖాన్‌తో తలపడనుంది. మరోవైపు రెండుసార్లు ఆసియన్‌ చాంపియన్‌షిప్‌ విజేత అయిన వియత్నాం బాక్సర్‌ టామ్‌తో నిఖత్‌ జరీన్‌ పోటీపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement