Friday, March 29, 2024

ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం.. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో తగ్గుతున్న హింస

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉగ్రవాదం, నక్సలిజం, వేర్పాటువాదం సహా దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేసే విషయంలో రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో హింస గణనీయంగా తగ్గుతూ వస్తోందని చెప్పారు. దీంతో శాంతి భద్రతలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల సంఖ్య తగ్గడమే కాకుండా వారు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారన్నారు. హైదరాబాద్‌ హకీంపేటలో ని సీఐఎస్‌ఎఫ్‌ నేషనల్‌ ఇండస్ట్రీయల్‌సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించిన సీ ఐఎస్‌ఎఫ్‌ 54 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత భద్రతా బలగాల నుంచి అమిత్‌ షా గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం మాట్లాడుతూ… ఉగ్రవాదంపౖైె ప్రధాని మోడీ అనుసరిస్తున్న కఠిన వై ఖరి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఉగ్రవాదం అణిచివేతలోనూ సీఐఎస్‌ఎఫ్‌ దళాలది కీలకపాత్ర అని చెప్పారు. ఇదే విషయాన్ని గడిచిన 9ఏళ్లలో చేసి చూపించామని గుర్తు చేశారు. దేశ పారిశ్రామిక ఆర్థిక ప్రగతిలో పటిష్ట భద్రతా సేవలతో సీఐఎస్‌ఎఫ్‌ బలగాలె కీలక పాత్ర పోషిస్తున్నాయని అమిత్‌ షా ప్రశంసించారు. 1969 మార్చి 10న 3వేల సిబ్బందితో ప్రారంభమై లక్షా 80వేల మందికి సీఐఎస్‌ఎఫ్‌ చేరుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, నాకశ్రయాలు, పవర్‌ప్లాంట్స్‌, జాతీయ పారిశ్రామిక భవనాలకు భద్రత కల్పిస్తోందని వివరించారు.

ఉగ్రవాదం , వేర్పాటువాదంపై 9ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రజల్లో విశ్వాసం నింపిందని అమిత్‌ షా తెలిపారు. సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు , నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశం కూడా అభివృద్ధి చెందదని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలని ప్రధాని మంత్రి మోడీ నిర్ణయించారని, ఈ లక్ష్య సాధనలో సీఐఎస్‌ఎఫ్‌ పాత్ర చాలా కీలకమైందన్నారు. గతంలో సీఐఎస్‌ఎఫ్‌ ఉత్సవాలు కొత్త ఢిల్లిdలో జరిగేవని, ఢిల్లిd వెలుపల ఈ ఉత్సవాలు తొలిసారిగా హకీంపేటలో జరుగుతున్నాయని చెప్పారు.

- Advertisement -

సీఐఎస్‌ఎఫ్‌ 54వ వ్యవస్థాపక దినోత్సవం హైదరాబాద్‌లోని హకీంపేటలో అట్టహాసంగా జరిగింది. రైజింగ్‌ డే సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు ప్రత్యేకంగా ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆటంకవాదులు ఆకస్మాత్తుగా దాడి చేస్తే ఎలా సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఎదుర్కొంటారో తెలిపే అంశంపై ప్రదర్శన నిర్వహించారు. ఒళ్లు గగుర్పొడిచేలా సాగిన ప్రదర్శనను చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. కేరళకు చెందిన ప్రాచీన మార్షల్‌ ఆర్ట్‌ కలరిపయట్టు విన్యాసాలను మహిళా జవాన్లు ప్రదర్శించారు. అనంతరం దేశ వ్యాప్తంగా సీఐఎస్‌ఎఫ్‌ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అమిత్‌ షా రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సీఐఎస్‌ఎఫ్‌కు కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement