Wednesday, April 24, 2024

నవీన్ చంద్ర ‘అర్ధశతాబ్ధం’ మూవీ ట్రైలర్.. ఈనెల 11 నుంచి ఓటీటీలోకి

నవీన్ చంద్ర, కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన‘అర్ధ శతాబ్దం’ మూవీ ట్రైలర్‌ను బుధవారం మధ్యాహ్నం హీరో నాని చేతుల మీదుగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. రవీంద్ర పుల్లె ఈ మూవీకి దర్శకత్వం వహించగా… నాఫాల్‌ రాజా సంగీతం సమకూర్చాడు.

‘ఈ విశాల సృష్టిలో మ‌నిషి క‌న్నా ముందు ఎన్నో జీవ‌రాశులుండేవి. ఒకానొక రాక్ష‌స ఘ‌డియ‌లో మానవ జాతి పుట్టుక సంభ‌వించింది’ అని శుభ‌లేఖ సుధాక‌ర్ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభ‌మ‌య్యే ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగింది. మ‌ధ్య‌లో ఓ ప్రేమ క‌థ‌, ఓ గ్రామంలోని ఇరు వ‌ర్గాల ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఆస‌క్తి పెంచుతోంది. నేప‌థ్య సంగీతం అల‌రిస్తోంది. ‘ఈ 50 ఏళ్ల స్వాతంత్ర్యం దేని కోస‌మో, ఎవ‌రి కోస‌మో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికీ అర్థం కాలేదు’ అనే డైలాగ్‌తో ఇచ్చిన ముగింపు ర‌క్తి క‌ట్టించింది. సాయికుమార్‌, ఆమని, పవిత్ర లోకేష్‌, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన‌ ఈ సినిమా జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను వీర్‌ ధర్మిక్‌ సమర్పణలో చిట్టి కిరణ్‌ రామోజు నిర్మించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement