Sunday, April 11, 2021

బైబిల్ పట్టుకునే రత్నప్రభ.. బీజేపీ అభ్యర్థా?

నవతరం పార్టీకి కేటాయించిన గాజుగ్లాసు గుర్తు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. అధికారం ఉంది కదా అని బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లి నవతరం పార్టీ గుర్తు గాజుగ్లాసును రద్దు చేయాలని కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓటమి భయంతో బీజేపీ ఎలక్షన్ కమిషన్‌ను మేనేజ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ అనుబంధ సంస్ధలు నవతరం పార్టీ అభ్యర్థిపై దాడులు చేసేందుకు అవకాశం ఉందని, తమకు భద్రత కల్పించాలని రావు సుబ్రహ్మణ్యం కోరారు.

తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ‘బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా?’ అని ప్రశ్నించిన మాటను గుర్తుచేస్తూ.. మరి బైబిల్ పట్టుకునే రత్నప్రభను బీజేపీ తన అభ్యర్థిగా ఎలా నిలబెట్టిందని నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ ప్రశ్నించారు. సీబీఐ కేసుల్లో ఉన్న రత్నప్రభను ఎలా పోటీ చేయిస్తున్నారని నిలదీశారు. జగన్‌కు బినామీ ఎవరో బీజేపీ నేతలే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News