Thursday, April 25, 2024

డిసెంబరులో రానున్న నాని ‘శ్యామ్ సింగరాయ్’

నేచురల్ స్టార్ నాని ఇటీవల టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు నాని కొత్త సినిమా శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. అంటే సుందరానికి సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా రాహుల్ సంకృత్యయన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.


దసరా సందర్భంగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఓ బిగ్ అప్‌డేట్ వచ్చింది. శ్యామ్ సింగరాయ్ సినిమాను డిసెంబరులో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాదు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా చిత్ర బృందం ప్రకటన చేసింది. అయితే విడుదల తేదీని మాత్రం బృందం ఫిక్స్ చేయలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement