Saturday, April 20, 2024

నాలుగు అమెరికన్ సాంగ్స్​తో ‘నాటు నాటు’ పోటీ.. ఆస్కార్–2023 లైవ్ ఈవెంట్ ఎక్కడ, ఎప్పుడు?

ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వలో వచ్చిన పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ RRR.. ఈ సినిమా ఆస్కార్ ప్రయాణంలో చివరి దశకు వచ్చింది. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఈ మూవీ ఆస్కార్ 2023లో అందరినీ అలరిస్తోంది. సినిమా నుంచి వచ్చిన చార్ట్‌బర్స్టర్ పాట నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్‌ను అందుకుంది. ఈ సాంగ్ రిహన్న & లేడీ గాగా పాటలతో పాటు నామినేట్ అయ్యింది.

ఆస్కార్ వేదికపై నాటు నాటు ప్రత్యక్షంగా ప్రసారం ఉంటుందని అకాడమీ ప్రకటించింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ ఆస్కార్‌ లైవ్ ఈవెంట్ ను ఆస్వాదించవచ్చనే చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబందించి ఆస్కార్ 2023 లైవ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే వివరాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఆస్కార్ 2023 ఇవ్వాల (ఆదివారం) లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. మన ఇండియన్ ఆడియన్స్ ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ ఫంక్షన్ ను OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్ స్టార్‌లో రేపు (మార్చి 13) ఉదయం 5.30 గంటలకు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ కార్యక్రమం వారి అధికారిక YouTube ఛానెల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement