Thursday, December 12, 2024

National- భారత్-భూటాన్ మ‌ధ్య ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’

లాంచ‌నంగా ప్రారంభించిన ఆ దేశ ప్ర‌ధాన మంత్రి
హాజ‌రైన కేంద్ర మంత్రి బండి సంజ‌య్
ఈ చెక్ పోస్ట్ తో ఇరుదేశాల బంధం మ‌రింత దృడం
వాణిజ్య , వ్యాపార , విస్త‌ర‌ణ ఇక సుల‌భం అన్న కేంద్ర మంత్రి

అసోం – భారత్-భూటాన్ దేశాల మధ్య మధ్య నేడు చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. అసోంలోని దరంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభమైంది. భూటాన్ ప్రధానమంత్రి శెరింగె తోబ్గే, అసోం గవర్నర్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా చేతుల మీదుగా ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్” ప్రారంభింఆచ‌రు. ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు వల్ల ఇరు దేశాల ప్రజల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. చెక్ పోస్టు ఏర్పాటుతో భారత్ కు లాజిస్టిక్ ఖర్చుల భారం చాలా మేరకు తగ్గనుంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింతగా పెరగనున్నాయి. వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలను సులభతరం కానుంది.

ఈ సంద‌ర్బంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ… ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభంతో భారత్, భూటాన్ దేశాల సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌తాయన అన్నారు.. భారత-భూటాన్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక సౌభ్రాతృత్వం, గొప్ప విశ్వాసం పైన ఉన్నాయ‌న్నారు.

ఇరుదేశాల మధ్య స్నేహం, సహకారం, సామాజికత భాగస్వామ్యానికి ప్రబల సాక్ష్యమని పేర్కొన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తి, సమాచార, ఆరోగ్యం, సాంస్కృతిక మార్పిడి, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన విద్య వంటి కీలక రంగాలకు విస్తరించిందన్నారు. ఇమ్రిగ్రేషన్ చెక్ పోస్టు ఏర్పాటువల్ల రవాణా, వాణిజ్య తోడ్పాటు అందించడం మాత్రమే కాకుండా పొరుగున ఉన్న దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న భారత్ ఆకాంక్ష‌ల‌కు సాక్షిగా ఉంటుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement