Thursday, April 25, 2024

పరామర్శించడానికి పర్మిషన్ ఎందుకు?: నారా లోకేష్

టీడీపీ యువ నేత నారా లోకేష్ నరసరావుపేట పర్యటన ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయనను… గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకుని, కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. లోకేష్ కాన్వాయ్ చుట్టూ పోలీసు వాహనాలు ప్రయాణస్తున్నాయి. మరోవైపు ఎయిర్ పోర్టు వెలుపల తన వాహనం కూర్చున్న నారా లోకేశ్ పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని లోకేష్ ప్రశ్నించారు.

‘మీ పర్యటనకు అనుమతిని నిరాకరించారు’ అంటూ ఓ పోలీస్ అధికారి సమాధానమివ్వడంతో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటన కోసం అసలు అనుమతినే అడగలేదని… అలాంటప్పుడు ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. తాను ధర్నా చేయడం లేదని, పాదయాత్ర చేపట్టడం లేదని… కేవలం ఒక కుటుంబాన్ని పరామర్శించి.. అక్కడ మీడియాతో మాట్లాడి అనంతరం తిరిగి వెళ్లిపోతానని చెప్పారు. అయినప్పటికీ తమను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. పరామర్శించడానికి పర్మిషన్ ఎందుకుని ప్రశ్నించారు. ఏది తప్పో, ఏది ఒప్పో తనకు తెలుసని… తనపై ఎలాంటి కేసులు లేవని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement