Sunday, December 4, 2022

18పేజెస్ చిత్రం నుండి.. ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఎనౌన్స్

18పేజెస్ చిత్రం నుండి ఫ‌స్ట్ సాంగ్ ని ఈ నెల 22రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. నిఖిల్ , అనుప‌మ ప‌ర‌మేశ్వరన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 18 పేజెస్ . ప‌ల్నాటి సూర్యప్రతాప్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా వస్తుంది. కాగా నిఖిల్‌ మెట్రో రైలులో పుస్తకం చదువుతూ..తన ప్రేయసిని ఊహించుకుంటూ ఈ పాట పాడుకుంటాడని తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రానికి స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై బన్నీ వాసు-సుకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ మ్యూజిక్ డైరెక్టర్‌. 18 పేజెస్‌లో అనుప‌మ పరమేశ్వరన్‌ నందిని అనే యువ‌తిగా కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement