Saturday, March 25, 2023

మ‌రీ ఇంత ఊర‌మాసా నానీ – ‘ద‌స‌రా’ టీజ‌ర్

నేచుర‌ల్ స్టార్ హీరో నాని నటిస్తోన్న తాజా మూవీ దసరా ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు.. తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

- Advertisement -
   

ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు,మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ సాగే పక్కా పల్లెటూరి మాస్‌ డైలాగ్స్ తో టీజర్ లో చుట్టేశారు. నీయవ్వ.. ఎట్టైతె గట్లాయే గుండు గుత్తగా లేపేద్దాం.. బాంచెన్‌ అంటూ పక్కా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ ఊర‌మాస్ మసాలా వేశాసాడు నాని. ఈ మూవీలో కీర్తీ సురేష్ హీరోయిన్. సాయికుమార్, స‌ముద్రఖని, జ‌రీనా వ‌హ‌బ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement