Friday, March 29, 2024

నాని 30వ మూవీకి.. చిరంజీవి క్లాప్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడుమీదున్నాడు..ఒక సినిమా సెట్ పైనే ఉండగా మరో చిత్రానికి కమిట్ అయ్యాడు.కాగా
నాని తన 30వ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేశాడు. శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫాదర్-డాటర్‌ రిలేషన్‌ షిప్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకులను తెగ నచ్చేసింది. న్యూఇయర్‌ కానుకగా అనౌన్స్‌ చేసిన ఈ ప్రాజెక్ట్‌ మంగళవారం ముహూర్తపు సన్నివేశాన్ని ప్రారంభించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర యూనిట్‌కు ఉత్సాహాన్నిచ్చారు. బుధవారం నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో ‘సీతారామం’ బ్యూటీ మృనాళ్‌ థాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళం మ్యూజిక్‌ డైరెక్టర్‌ హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement