Thursday, June 1, 2023

నాందేడ్ గురుద్వారాని సంద‌ర్శించిన.. సీఎం కేసీఆర్

నాందేడ్ చారిత్రక గురుద్వారాను సంద‌ర్శించారు సీఎం కేసీఆర్. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు సిక్కు మ‌త‌ గురువులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం గురుద్వారాలో కేసీఆర్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ప్రార్థ‌న‌ల అనంత‌రం కేసీఆర్‌ను సిక్కు మ‌త గురువులు ఆశీర్వ‌దించారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ క‌విత‌తో పాటు ప‌లువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.నేడు నాందేడ్ లో సీఎం కేసీఆర్ లో స‌భ నిర్వ‌హించ‌నున్నారు. కాగా కేసీఆర్ సభాస్థలికి చేరుకోనున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతారు.
అనంతరం బీఆర్‌ఎస్‌ నాందేడ్‌ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగించ‌నున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement