Saturday, April 20, 2024

షూటింగ్‌లో హీరో బాలయ్యకు గాయం

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. అయితే అది చిన్న గాయమేనని, కంగారు పడాల్సిందేమీ లేదని సమాచారం. షూటింగ్ సమయంలో కాలికి దెబ్బ తగిలినప్పటికీ బాలయ్య దానిని పెద్దగా పట్టించుకోకుండా పనిపై దృష్టి పెట్టారు. అసలు ఆ గాయం ఏంటి ? షూటింగ్ ఎక్కడ జరిగింది ? అంటే… బాలయ్య ఓ టాక్ షోలో కన్పించబోతున్నారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆహా కోసం బాలకృష్ణ ఓ టాక్ షోను నిర్వహించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

శుక్రవారం ఈ షోకు సంబంధించిన ఫోటోషూట్ జరిగిందట. ఆహా టాక్ షో ఫోటో షూట్ సమయంలో బాలయ్య కాలుకి చిన్న గాయం అయింది. కానీ బాలయ్య సమయం వృధా చేయకుండా గాయాన్ని లెక్క చేయకుండా ఫోటో షూట్ కానిచ్చేశారు. పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావం నందమూరి అభిమానులను ఫిదా చేసేస్తోంది. సినిమాల కోసం ఆయన పడే తపన, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement