Thursday, April 25, 2024

వైరల్: బార్‌లో నగ్నంగా తిరిగిన మందుబాబు

అప్పటి వరకూ బాగానే ఉన్న ఓ వ్యక్తి.. అకస్మాత్తుగా విచిత్రంగా ప్రవర్తించాడు. ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసి, పక్కన పడేశాడు. బార్‌లో నగ్నంగా తిరిగుతూ అందరినీ అయోమయానికి గురి చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఈ నెల 14న స్థానికంగా ఉన్న ఓ బార్‌లోకి వెళ్లాడు. మద్యం సేవించే వారి పక్కన కొద్దిసేపటి వరకూ కూర్చుని.. అందరినీ గమనించాడు. అనంతరం ఒక్కసారిగా పైకి లేచి.. విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసి, పక్కన పడేశాడు. నగ్నంగా బార్‌లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. కౌంటర్ దగ్గరకు వెళ్లి, అక్కడి సిబ్బందితో కొద్ది సమయం వరకు సంభాషించాడు.

సదరు మందుబాబు తర్వాత వెనక్కి వచ్చి.. మళ్లీ తన దుస్తులను ధరించాడు. కాగా సదరు వ్యక్తి ఉన్నట్టుండి ఎందుకు బట్టలు విప్పేశాడో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ‘ఏముంది.. పీకలదాకా తాగి.. ఎవరితోనే బెట్ కట్టి ఉంటాడు.. అందుకే అలా చేశాడేమో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఫొటోను ఇప్పటి వరకు 10 వేల మంది వీక్షించగా అందులో దాదాపు 700 మంది కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement