Wednesday, April 24, 2024

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్

డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ద‌క్షిణాది న‌టి, టాలీవుడ్ హీరోయిన్ నైరా షాను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. డ్ర‌గ్స్ వాడుతున్నార‌న్న స‌మాచారంతో ముంబై జుహూలోని హోట‌ల్ రూంలో ఎన్సీబీ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ కేసులో నటి నైరా షాతో పాటు ఆమె స్నేహితుడు ఆశిఖ్ సాజిద్ హుస్సేన్ ను అరెస్ట్ చేశారు. సిగ‌రెట్లలో చుట్ట‌బ‌డి ఉన్న ఒక గ్రాము గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ అధికారి ఒక‌రు తెలిపారు.

ఉద‌యం 3 గంట‌ల‌కు చేప‌ట్టిన త‌నిఖీల్లో ఇద్ద‌రి ద‌గ్గ‌ర గ్రాము గంజాయిని గుర్తించిన‌ట్టు తెలిపారు. ఆదివారం రాత్రి నైరా షా పుట్టిన‌రోజు. హోట‌ల్ లో పార్టీ అనంత‌రం గంజాయి తీసుకున్న‌ట్టుగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న అధికారులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. నైరా షా తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘బుర్ర క‌థ’ చిత్రంతో పాటు ‘ఇఈ’ అనే చిత్రంలోనూ న‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement