Friday, April 26, 2024

థార్ మార్ థ‌క్క‌ర్ మార్ సాంగ్ కి డ్యాన్స్ చేసిన నాగార్జున‌-వైర‌ల్ గా ప్రోమో

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్6కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ నుంచి రిలీజైన థార్ మార్ థ‌క్క‌ర్ మార్ నెట్టింటింట ట్రెండింగ్ అవుతోంది. ఈ పాట‌కు నాగార్జున స్టెప్పేలేశాడు. బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌లో డ్యాన్స‌ర్ల‌తో క‌లిసి స్టెప్పులేసిన ప్రోమో ఒక‌టి ఇపుడు ఆన్‌లైన్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో వ‌స్తున్న గాడ్ ఫాద‌ర్ చిత్రాన్ని మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తుండ‌గా..ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రోవైపు ప్ర‌వీణ్‌స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ది ఘోస్ట్ పై కూడా అంచ‌నాలు ఎక్కువే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి వ‌సూళ్లు రాబ‌డ‌తాయ‌న్న‌ది చూడాలి మ‌రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement