Thursday, April 18, 2024

ఆకట్టుకుంటున్న ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ను సోమవారం ఉదయం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు సూపర్బ్. బిజినెస్ చేయాలనుకునే ఆలోచనలో చైతూ పడ్డ కష్టాలను చూపించారు. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇబ్బందులు సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నట్టు కనిపిస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి డ్యాన్సర్‌గా కనిపించబోతుంది. ట్రైలర్‌లో చైతూ, సాయి పల్లవి మధ్య డైలాగులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా ట్రైలర్‌లో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్స్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement