Thursday, April 25, 2024

నాగచైతన్య ’కస్టడీ‘లో సినీ లవర్స్​.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

అక్కినేని నాగ చైతన్య రీసెంట్ మూవీ ‘కస్టడీ’. విక్రమ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా థియేట‌ర్ల‌లో మెజారిటీ ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. కాగా, ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని లాక్ చేసినట్లు తాజా సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో వారి సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో జూన్ 9 నుండి ఈ మూవీని తమ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు ప్రకటించింది.

తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కన్నడ, మలయాళ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన కాప్ డ్రామాలో ప్రియమణి, అరవింద్ స్వామి కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందించగా.. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement