Wednesday, March 27, 2024

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న చైతూ ‘లవ్‌స్టోరీ’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్‌స్టోరీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాకు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మంచి కాఫీ లాంటి సినిమాలు తీయ‌డంలో శేఖ‌ర్ క‌మ్ముల దిట్ట అని ప్రేక్ష‌కులు భావిస్తుంటారు. ఇక చ‌క్క‌నైన ప్రేమ‌క‌థ‌ల‌ను తెర‌కెక్కించే శేఖ‌ర్ క‌మ్ముల చివ‌ర‌గా ఫిదా సినిమాతో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు.

దాంతో చైతూ నటించిన ల‌వ్ స్టోరీపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. సోమవారం నాడు ల‌వ్ స్టోరీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయగా.. ఈ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే 5 మిలియ‌న్స్ వ్యూవ్స్ రాగా ప‌ది గంట‌ల్లో ఈ ట్రైల‌ర్‌కు 300K లైక్స్ వ‌చ్చాయి. ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్‌కు భారీ స్పందన వ‌స్తుండ‌టంతో ఈనెల 24న విడుదల కానున్న సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement