Thursday, April 18, 2024

బిగ్ బాస్ షోని ర‌ద్దు చేసేంత వ‌ర‌కు నా పోరాటం ఆగ‌దు.. సీపీఐ నారాయ‌ణ‌

బిగ్ బాస్ షోని ర‌ద్దు చేసేంత‌ వ‌ర‌కు త‌న పోరాటం ఆగ‌ద‌ని చెప్పారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సినీ నటుడు నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోపై ఆయ‌న మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని విమర్శించారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని… తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను స్వీకరించలేదని తెలిపారు. అయితే ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని… ఇందుకు ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి కూడా నారాయణ దీనిని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టాస్కుల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ గా కూడా ఆయన అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement