Wednesday, April 24, 2024

విదేశీ పెట్టుబడుకు మ్యూచువల్‌ ఫండ్స్‌కు అనుమతి..

విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దేశంలో మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలకు సెబీ అనుమతి ఇచ్చింది. అన్ని సంస్థల పెట్టుబడులు 7 బిలియన్‌ డాలర్లకు మించకూడదని స్పష్టం చేసింది ఈ పరిమితికి మించి పెట్టుబడులు పెట్టడంతో ఈ సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి విదేశీ స్టాక్స్‌లో పెట్టుబుడులు పెట్టడాన్ని సెబీ నిషేధించింది. ఇటీవల కాలంలో వరసగా స్టాక్‌ మార్కెట్ల పతనం తో గతంలో పెట్టిన పెట్టుబడి విలువ తగ్గిపోయింది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులకు అనుమతి ఇవ్వాల్సిందిగా పలు సంస్థలు సెబీని కోరాడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెబీ అనుమతి ఇవ్వడంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ విదేశీ స్టాక్స్‌లోనూ, ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. 7 బిలియన్‌ డాలర్లకు మించకుండా పెట్టుబడి పెట్టేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ను సెబీ కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement