Thursday, March 28, 2024

వూహాన్‌లో మ్యూజిక్ ఫెస్టివల్.. అంతా చేసి మాస్కులు లేకుండా పార్టీలు..!

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా రక్కసి గడగడలాడిస్తోంది. అన్ని దేశాలు అన్ని రంగాలపై కరోనా ఎఫెక్ట్తో ఆర్థిక, ఆరోగ్య అంశాలు పూర్తిగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో అసలు కరోనా కేంద్ర బిందువైన వూహాన్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. తాజాగా ఇక్కడ స్ట్రాబెర్రీ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించారు. ఏటా నిర్వహించే ఈ వేడుకను గతేడాది కరోనా భయంతో ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేశారు.

తాజాగా ఈ వేడుకను నిర్వహిస్తే దాదాపు 11వేలమంది ప్రజలు ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. వీరిలో చాలామంది కనీసం మాస్కు కూడా పెట్టుకోలేదు. ఇక్కడ చాలారోజులుగా కరోనా కేసులేవీ వెలుగుచూడటం లేదు. మొదట కరోనా కేసు వూహాన్‌లో నమోదైంది. చైనా కావాలని కరోనా వైరస్ ని ప్రపంచం పైకి వదిలిందని ఇప్పటికీ అన్ని దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వూహాన్‌లో పరిస్థితులు కూడా ఈ అనుమానాలకు మరింత ఊతం ఇస్తున్నాయి. అయితే చైనా ప్రభుత్వం మాత్రం రెండు నెలల కఠిన లాక్‌డౌన్‌తో వూహాన్‌లో కరోనా వైరస్ పూర్తిగా మాయమైంది చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement