Thursday, April 18, 2024

Munugode by poll results : జోరు తగ్గని కారు.. తొమ్మిదో రౌండ్ లో టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం

మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. టీఆర్ఎస్ హ‌వానే కొన‌సాగుతోంది. ఆదినుంచి టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలోనే కొనసాగుతున్నది. తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్ 3925 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొమ్మిదో రౌండ్‌లో కారు గుర్తుకు 7497 ఓట్లు, బీజేపీకి 6665 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ రౌండ్‌లో 832 ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి 3091 ఓట్ల లీడ్‌లో కొన‌సాగింది. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6624 ఓట్లు పోలవగా, బీజేపీకి 6088 ఓట్లు వచ్చాయి. దీంతో ఎనిమిదో రౌండ్‌లో కారు గుర్తుకు 536 ఓట్లు అధికంగా వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement