Thursday, September 23, 2021

డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మొమైత్ ఖాన్

టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప‌లువురు సెల‌బ్రిటీల‌ను గంటల కొద్ది ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాసేపటి క్రితం ముమైత్ ఖాన్ ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

ఈడీ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్ తన ఆడిటర్‌తో పాటు బ్యాంకు ఖాతాలను తీసుకొచ్చింది. ముంబై నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ముమైత్ ఖాన్ చేరుకోగా, అక్క‌డ నుండి క్యాబ్‌లో ఈడీ కార్యాల‌యానికి చేరుకున్న‌ట్టు తెలుస్తుంది. కెల్విన్‌తో పాటు ముమైత్ ఖాన్‌ని ప‌లు కోణాల‌లో విచారించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఈ కేసులో ఈనెల 17న తనీష్, 22న తరుణ్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News