Thursday, March 28, 2024

ముహూర్తం ఫిక్స్‌.. ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న (సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు) ఈ కార్యక్రమం ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పెరుగుతున్న భౌగోళిక అవసరాల నేపథ్యంలో, అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. వాస్తు సహా అన్ని రకాలుగా పరిశీలించి, వచ్చే వందేళ్ళను దృష్టిలో పెట్టుకుని 20 ఎకరాల మేర చతురస్రాకార స్థలంలో నిర్మానం పూర్తి చేశారు. మొత్తం ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం మేరకు, ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రివర్గ సమావేశ మందిరం తో పాటు మరో పెద్ద సమావేశ మందిరం ఉంటాయి. రెండో అంతస్తు నుంచి మంత్రుల కార్యాలాయాలు ఉంటాయి.

ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉండనున్నాయి. సర్వర్లు, స్టోర్‌ రూంలు, తదితర అవసరాలన్నింటినీ కింది అంతస్థులోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మానంతో భవిష్యత్తు అవసరాలు సైతం తీర్చేలా విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు విడిగా పార్కింగ్‌ ఉంటు-ంది. ఉన్నతాధికారులు, సిబ్బందికి కూడా వేర్వేరుగా పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ వసతి కల్పించనున్నారు. అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు, మిగతా కార్యాలయాలన్నీ సచివాలయం వెలుపలే ఉంటాయి. ప్రహరీ లోపల కేవలం సచివాలయ భవనం మాత్రమే ఉంటు-ంది

Advertisement

తాజా వార్తలు

Advertisement