Monday, November 4, 2024

MSME Policy 2024 – పరిశ్ర‌మ‌ల‌కు ప్రొత్సాహాలు కొన‌సాగిస్తాం – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంస్ఎంఈ పాలసీ-2024 ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన కృషిని ఎవరూ మరువలేరని అన్నారు. విధానపరమైన రూపకల్పనలు లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి చెందదని తెలిపారు. ప్రభుత్వం విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం డెవలప్‌ అవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పాలకులు మారినా .. విధానాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని అన్నారు

చంద్రబాబు తెచ్చిన ఐటి నీ..అంతకంటే ఎక్కువ వేగంగా వైఎస్ అభివృద్ధి చేశారు కాబట్టే.. ఇంత అభివృద్ధి చెందిందని తెలిపారు. కొవిడ్ కాలం లో మూడు వ్యాక్సిన్ లు ఇక్కడే తయారు అయ్యాయ‌ని గుర్తు చేశారు.. తెలంగాణ‌కు ఐటి నీ తెచ్చింది..అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అన్నారు. పరిపాలన విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లీవ్ అన్నారు. మంచి పని కొనసాగిస్తామ‌ని,.. విఘాతం కలిగించే అంశాలు ఉంటే తొలగిస్తామ‌ని అన్నారు.

బాగా చ‌దువుకుని విద్యార్దులు సర్టిఫికెట్లు సంపాదిస్తున్నార‌ని, కానీ ఉద్యోగం కి వచ్చేసరికి సర్టిఫికెట్లు అక్కరకు రావడం లేదన్నారు. స్కిల్ ఎంప్లాయి రావడం లేదని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారన్నారు. అందుకే ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ కింద్రాలు గా మార్చ బోతున్నం అన్నారు. రేపు పారిశ్రామిక వేత్తలతో ఆనంద్ మహేంద్ర సమావేశం ఉంద‌ని అంటూ, . స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తారన్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనం ఏం లేదన్నారు.

రుణ మాఫీ చేసినా క‌ష్టాలు తీర‌డం లేదు ..

రైతుల‌కు రుణమాఫీ చేశామ‌ని,. అయిన రైతులు బాధలు తప్పడం లేదని రేవంత్ అన్నారు. సమస్య ఏంటంటే.. కుటుంబం అంతా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. అగ్రికల్చర్ ఇజ్ అవర్ కల్చర్ అన్నారు. అయితే కుటుంబంలో ఒకరిద్దరు వ్యవసాయం చేయండి.. మిగిలిన ఒకరిద్దరు నైపుణ్యం పెంచుకుని పరిశ్రమలు పెట్టాలని కోరారు. ఒకప్పుడు కృష్ణా జిల్లాల్లో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే కృష్ణా జిల్లాలో పది ఎకరాలు వస్తుందన్నారు. చైనా తో పోటీ పడి గొప్పగా ఎదగొచ్చని తెలిపారు. పరిశ్రమలు పెట్టీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. పీవీ ప్రధాని అయ్యాకా.. సరళీకృత విధానాలు వచ్చాయన్నారు. ప్రపంచం తో పోటీపడేలా చేశారన్నారు. పీవీ తర్వాత మంథని నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇవాళ పాలసీ రెడీ చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement