Saturday, April 20, 2024

విశాఖలో స్కూలును కూల్చివేసిన ప్రభుత్వం.. జగన్‌కు వీడియో సందేశం పంపిన మాజీ క్రికెటర్

విశాఖలో ఇటీవల హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేత అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయంలో ఏపీ సర్కారుపై భారీగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంలో భారత మాజీ క్రికెటర్, టీమిండియా సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. స్కూలు కూల్చివేతను నిరసిస్తూ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకు ఓ వీడియో సందేశం పంపారు. ఆ పాఠశాల 140 మంది విద్యార్థులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. పాఠశాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిని ఎమ్మెస్కే ప్రసాద్ కోరారు.

ఇదే అంశంలో ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నం విజయసాయిరెడ్డి అడ్డాగా మారుతోందని విమర్శించారు. మానసిక దివ్యాంగుల పాఠశాలక సాయం చేయాల్సింది పోయి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement