Thursday, April 18, 2024

నా సత్తా ఏంటో చూపిస్తా: జక్కంపూడికి ఎంపీ భరత్ కౌంటర్

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. క్రమశిక్షణ, అంకితభావంతో ఉన్న కార్యకర్తగా పార్టీలో పనిచేస్తున్నానని, సీఎం జగన్ తనపై నమ్మకంతో ఎంపీగా అవకాశం ఇచ్చారని తెలిపారు. తన తమ్ముడు భరత్ అని ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలు నాకు చాలని, కొంతమంది నాయకులు తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ నేతలు బుచ్చయ్యతో పెందుర్తి వెంకటేష్‌తో తాను కుమ్మక్కయ్యానని సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని జక్కంపూడికి సవాల్‌ విసిరారు. జక్కంపూడిలా తాను చీకటి రాజకీయాలు చేయనన్నారు. జేడీ లక్ష్మీనారాయణతో ఒక ప్రోగ్రాం లో మాత్రమే కలిశాను, తాను సెల్ఫీ దిగితే ఫుటేజ్ చెక్ చేసుకోవాలని చురకలు అంటించారు. ఆ సందర్భంలో సీఎం జగన్ పరిపాలనను జేడీ ప్రశంసించినట్లు గుర్తు చేశారు. తనను రఘురామకృష్ణంరాజుతో పోల్చడం సిగ్గు చేటని మండిపడ్డారు. తనకు పార్టీ ఇచ్చిన లక్ష్మణగీతను దాటనని.. జక్కంపూడి ఆయన పరిధిలో ఉంటే చాలా మంచిదని హితవు పలికారు. లేదంటే తన సత్తా ఏంటో చూపించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement