Thursday, April 18, 2024

మాస్కోవా నుంచి మృతదేహాల తరలింపు?

ఉక్రెయిన్‌ క్షిపణి దాడుల్లో మునిగిపోయిన రష్యా యుద్ధనౌక మాస్కోవా వ్యవహారంలో పుతిన్‌ ప్రభుత్వం రహస్య కార్యక్రమం నిర్వహించిందని తాజాగా తేలింది. ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క సైనికుడు మరణించాడని రష్యా బీరాలు పలికినప్పటికీ వందల సంఖ్యలో నావికాదళాన్ని కోల్పోయిందని అంతర్జాతీయ సమాజం కోడై కూసింది. ఆ నౌకలో కనీసం 540మంది సిబ్బంది, నౌకాదళ సభ్యులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉక్రెయిన్‌ నెప్య్టూన్‌ క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలోని నలుగురైదుగురు అత్యున్నత అధికారులు పలాయనం చిత్తగించారని, మిగతావారంతా జలసమాధి అయ్యారని తాజాగా తేలింది. నౌక మునిగిపోక ముందు డెక్‌పై హెలికాప్టర్‌ బయలుదేరేందుకు సిద్ధమవడం, ప్రమాదకర పరిస్థితుల్లో వాడేందుకు ఉండే చిన్నపాటి పడవలు సిద్ధంగా ఉండటంవంటి దృశ్యాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి.

దీనిని బట్టి సాధారణ సిబ్బందిని బలిపశువును చేశారని, మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే రష్యా రెండు వారాలుగా ఒక రహస్య కార్యక్రమాన్ని చేపట్టింది. మునిగిపోయిన యుద్ధనౌకలోని మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించింది. నౌకలోని కీలక పరికరాలను, యంత్రసామాగ్రిని, రహస్య వ్యవస్థను తరలించింది. శత్రుదేశాలకు ఆ వివరాలు చేరకుండా జాగ్రత్తపడింది. ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ అధికార ప్రతినిధి అయితే రష్యా ఈ విషయంలో బహిరంగంగా ఏమీ చెప్పడం లేదు. రెండో ప్రపంచయుద్ధం తరువాత రష్యా కోల్పోయిన అతిపెద్ద యుద్ధనౌక మాస్కోవాయే.

Advertisement

తాజా వార్తలు

Advertisement