Tuesday, April 23, 2024

భార‌త్ లో లాంచ్ అయిన మోట‌రోలా బ‌జ్డెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్.. ధ‌ర, స్పెసిఫికేష‌న్స్ ఇవే

మోట‌రోల నుంచి మ‌రో కొత్త 5జీ ఫోన్ ఇండియ‌న్ మార్కేట్ లో రిలీజ్ అయింది. జీ సిరీస్‍లో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‍ను మోటోరోలా తీసుకొచ్చింది. మోటో జీ73 5జీ మొబైల్ భారత మార్కెట్‍లో ఇవ్వాల (శుక్రవారం) లాంచ్ అయింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. మీడియాటెక్ డైమన్సిటీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మోటో జీ73 5జీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.

మోటో జీ73 5జీ స్పెసిఫికేషన్లు..

6.5 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ LCD డిస్‍ప్లే

- Advertisement -

181 గ్రాముల బరువు

120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్

మీడియాటెక్ డైమన్సిటీ 930 ప్రాసెసర్‌

8బీజీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‍

ఫోన్ బ్యాక్ సూర్ రెండు కెమెరాలు

50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మాక్రో కెమెరా

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍ తో పాటు ఈ మొబైల్‍కు ఆండ్రాయిడ్ 14 అప్‍డేట్ వస్తుందని మోటోరోలా పేర్కొంది.

5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్‍ఎఫ్‍సీ, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్, 3.5mm హెడ్‍ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి.

మోటో జీ73 5జీ ధర, సేల్, ఆఫర్లు

మోటో జీ73 5జీ ఒకే వేరియంట్‍లో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర రూ.18,999గా ఉంది. ల్యుసెంట్ వైట్, మిడ్‍నైట్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో మార్చి 16వ తేదీ నుంచి అందుబాటులో ఉండ‌నుంది. కార్డు ఆఫర్‌ను ఉపయోగించుకొని మోటో జీ73 5జీని కొంటే రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం వినియోగించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement