Friday, April 19, 2024

కొడుకుని కాటు వేయ‌బోయిన పాము-ప్రాణాల‌కి తెగించి కాపాడిన త‌ల్లి-వైర‌ల్ గా వీడియో

త‌న ప్రాణాల‌ను సైతం రిస్క్ లో పెట్టి త‌న కొడుకుని పాము కాటు నుంచి ర‌క్షించుకుంది ఓ త‌ల్లి.ఈ ఘ‌ట‌న సీసీటీవీ కెమెరాకు చిక్కింది.దాంతె ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు అంతా ఆ తల్లి సాహస కార్యానికి ఫిదా అవుతున్నారు. లవ్ ఎమోజీలతో ముంచెత్తుతున్నారు.కాగా ఈ సంఘ‌ట‌న కర్ణాటకలోని మాండ్యాలో చోటు చేసుకుంది.వివ‌రాల్లోకి వెళ్తే..ఓ తల్లి, కొడుకు ఇంటి బయటకు వస్తున్నారు. వారు దాదాపు మెట్ల వరకు వచ్చారు. ఆ మెట్ల కింది నుంచి నిశ్శబ్దంగా ఓ పాము జారుకుంటున్న విషయం వారికి తెలియదు. మెట్ల దాకా వచ్చిన తర్వాత కొడుకు తల్లి కంటే ఓ అడుగు ముందుకు నడిచాడు. మెట్లు దిగుతూ కింద అడుగు వేశాడు.

ఆ అడుగు సరిగ్గా పాము పైన పడుతుండగా… ఆ భారీ నాగు పాము వెంటనే అప్రమత్తమై తలతోపాటుగా దాదాపు సగం మేరకు వెనక్కి కదిలింది. పాము దాదాపు మోకాలి ఎత్తు వరకు పడగ విప్పి నిలబడింది. ఆ వీడియో చూస్తున్నవారికే పై ప్రాణాలు పైకే పోయేంత పని అవుతోంది. అలా పడగ విప్పి అంత ఎత్తు లేచిన పాము ముందు కొడుకు ఉన్నాడు. మెట్ల పై ఉన్న తల్లికి ఆ పాము పడగ కనిపించింది. అంతే.. మరో ఆలోచనే లేకుండా ఆమె వెంటనే మెట్లు దిగి కొడుకును రక్షించుకుంది. ఆ తల్లి తన బిడ్డను దగ్గరకు తీసుకోగానే.. ఆగ్రహంగా పడగ విప్పి పైనకు లేచిన పాము మళ్లీ తన దారిలో తాను వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement