Thursday, April 18, 2024

ఉపాధి హమీ పనుల్లో మరింత పారదర్శకత.. ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నపై కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే క్రమంలో మరింత పారదర్శకత తీసుకొచ్చామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొత్తగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి యాప్ ద్వారా పని ప్రదేశంలో కార్మికుల హాజరు (అటెండెన్స్) నమోదు చేసే విధానాన్ని 2021 మే 21 నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

ఒక రోజులో 20 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికుల మస్టర్ రోల్స్ ఈ యాప్ ద్వారా జారీ చేయవచ్చునని, తద్వారా చెల్లింపుల ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టడానికి దోహదపడుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో అందుబాటులో ఉందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యాప్ ఉపయోగిస్తున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. యాప్ ఉపయోగంచే క్రమంలో ఏ రాష్ట్రం నుంచి ఫిర్యాదులు, సమస్యలు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement