Tuesday, April 16, 2024

మంకీపాక్స్ పేరు మార్చాలి : ప్రపంచ ఆరోగ్య సంస్థ

మంకీపాక్స్‌ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి అత్యవసర సమావేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వహిస్తోంది. అదే సమయంలో ఈ వ్యాధి పేరును మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఎటువంటి వివక్షకు, కళంకా నికి దారి తీయని రీతిలో పేరును నిర్ణయించాలని శాస్త్రవేత్తలు కోరుతున్న నేపథ్యంలో ఈ పరిశీలన జరుగుతోంది. మంకీపాక్స్‌ వైరస్‌, దాని రూపాంతరాలు, వాటివల్ల కలిగే వ్యాధి పేర్లను మార్చ డంపై ప్రపంచంలోని సంబంధిత భాగస్వాములు, నిపుణులతో కలిసి డబ్ల్యుహెచ్‌ఓ కృషి చేస్తోంది డబ్ల్యుహెచ్ఓ. సాధ్యమైనంత త్వరగా కొత్త పేర్ల గురించి ప్రకటనలను జారి చేయబోతుంది.

మంకీపాక్స్‌ పేరు ఎందుకు మార్పు?

ఆఫ్రికాతో పాటు ప్రపంచం నలుమూలల లోని దాదాపు 30 మంది శాస్త్రవేత్తలు మంకీపాక్స్‌ పేరును మార్చాలని కోరారు. ఈ వ్యాధి కారణంగా జరిగే నష్టం గురించి తెలియజేయడం కోసం ఎక్కువగా ఆఫ్రికన్‌ రోగుల చిత్రాలనే ప్రధాన మీడియాలో ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. డబ్ల్యుహెచ్‌ఒ ఈ వైరస్‌కు రెండు రూపాలు ఉన్నాయని, అవి సెంట్రల్‌ ఆఫ్రికన్‌ (కాంగో బేసిన్‌) వెస్ట్‌ ఆఫ్రికన్‌ రూపాంతరాలని ప్రకటించింది. మంకీ పాక్స్‌ మొదట ఎక్కడ ప్రారంభమైందనే అంశంపై స్పష్టత లేదు. అయితే దీనికి ఖండాంతరాల సంబంధం ఉందని, అంతకుముందు ఊహించినట్లు కాకుండా ఇది చాలా వేగంగా మానవులకు వ్యాపిస్తుందని తెలుస్తుంది. ఈ అంతర్జాతీయ వ్యాధికి ఆఫ్రికా లేదా పశ్చిమ ఆఫ్రికా లేదా నైజీరియాతో సంబంధం ఉందని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. కాంగో బేసిన్‌ రూపాంతరానికి క్లేడ్‌ 1 అని, వెస్ట్‌ ఆఫ్రికన్‌ రూపాంతరాలకు క్లేడ్‌ 2, క్లేడ్‌ 3 అని నామకరణం చేయాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement