Thursday, April 25, 2024

మనీ ఈజ్ ఇంజీరియ్ టూ వరల్డ్..  ‘బిచ్చగాడు 2’ అప్‌డేట్ వచ్చేసింది!

తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా మారి విజయవంతమైన సంగతి తెలిసిందే. శశి దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘పిచైకారన్‌’. 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించి విజయ్‌ ఆంటోని సినీ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమానే తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదల చేశారు. ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్టు గతంలో విజయ్ ఆంటోని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా విజయ్ ఆంటోని చేపట్టారు.

అయితే, ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతున్న సమయంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో ‘బిచ్చగాడు 2’ సినిమాపై బోలెడన్ని పుకార్లు వచ్చాయి. వాటన్నింటికీ ఇప్పుడు స్వస్తి చెబుతూ తన సినిమా అప్‌డేట్ ఇచ్చారు విజయ్ ఆంటోని. ఈ సినిమా స్నీక్ పీక్ ట్రైలర్‌ను రేపు విడుదల చేస్తున్నట్టు విజయ్ ఆంటోని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కాగా, రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ట్రైలర్ విడుదలవుతుంది.

కాగా, ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాకుండా మూవీ డిజిటైల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. అలాగే, శాటిలైట్ రైట్స్ స్టార్ బ్రాడ్‌కాస్టింగ్ గ్రూప్ కొనుగోలు చేసింది. అంటే, తెలుగులో స్టార్ మా టీవీలో, తమిళంలో విజయ్ టెలివిజన్‌లో ‘బిచ్చగాడు 2’ సినిమా ప్రీమియర్ అవ్వనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement