Thursday, March 28, 2024

భాంగ్రా డ్యాన్స్ తో దుమ్ము రేపిన అక్ష‌య్ కుమార్ .. మోహ‌న్ లాల్

భాంగ్రా డ్యాన్స్ చేశారు స్టార్ న‌టులు అక్ష‌య్ కుమార్..మోహ‌న్ లాల్. ఓ పెండ్లి వేడుకకు హాజ‌రైన క్రమంలో అక్క‌డ ఆడిపాడిన వీడియోను అక్ష‌య్ కుమార్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ధోల్ బీట్స్‌కు అనుగుణంగా వీరు డ్యాన్స్ మూమెంట్స్‌తో దుమ్ము రేప‌డం ఈ వీడియోలో క‌నిపిస్తుంది. మోహ‌న్‌లాల్ స‌ర్‌తో డ్యాన్స్ చేసిన ఈ క్ష‌ణాల‌ను తాను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాన‌ని ఈ పోస్ట్‌కు అక్ష‌య్ క్యాప్ష‌న్ ఇచ్చారు.ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే అక్ష‌య్ త‌దుప‌రి సెల్ఫీ మూవీలో సంద‌డి చేయ‌నున్నారు. ఈ సినిమాను రాజ్ మెహ‌తా తెర‌కెక్కించ‌గా ఫిబ్ర‌వ‌రి 24న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement