Friday, March 31, 2023

కేసీఆర్ కుటుంబం పై మోదీ టార్గెట్ : అసదుద్దీన్ ఓవైసీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని మోదీ టార్గెట్ చేశార‌ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణను ఎదుర్కోనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఓవైసీ మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… బీజేపీ ఎంపీలు ముస్లింలను ఆర్థికంగా బైకార్ట్ చేయాలని పిలుపునిచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం అంతర్గత అభివృద్ధి కొరకు కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని వేధించడంలో బిజీగా ఉన్నది అంటూ అసదుద్దీన్ సెటైరికల్ ట్వీట్ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement