టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన కృష్ణంరాజు మరణం ప్రధాని నరేంద్రమోదీని కదిలించింది. పలు అనారోగ్య సమస్యలతో కృష్ణంరాజు మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. ట్విట్టర్ లో ప్రత్యేకంగా ఒక ట్వీట్ చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు తనను కలుసుకున్నప్పటి ఫొటోను జత చేశారు. శ్రీ యూవీ (ఉప్పల పాటి వెంకట) కృష్ణంరాజు గారు అకస్మాత్తుగా కాలం చేశారు. ఆయన సినిమా ప్రదర్శన, సృజనాత్మకతను తదుపరి తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. సామాజిక సేవలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. రాజకీయ నాయకుడిగా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
కృష్ణంరాజు మృతి పట్ల మోడీ సంతాపం

Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement