Monday, April 15, 2024

Big Breaking | ఈడీ ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్సీ క‌విత‌.. 9 గంట‌ల‌పాటు విచార‌ణ‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌విత‌ను ఇవ్వాల (శ‌నివారం) ఢిల్లీలో ఈడీ విచార‌ణ చేప‌ట్టింది. దాదాపు తొమ్మిది గంట‌ల‌పాటు క‌విత‌ను అయిదుగురు అధికారుల బృందం ప‌లు ర‌కాలుగా ప్ర‌శ్నించింది. అయితే.. రాత్రి 8 గంట‌ల త‌ర్వాత క‌విత ఈడీ ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీంతో ఆఫీసు ప‌రిస‌రాల్లో సంద‌డి క‌నిపించింది. పెద్ద ఎత్తున అక్క‌డికి చేరుకున్న అభిమానులు, బీఆర్ ఎస్ లీడ‌ర్లు, కార్య‌క‌ర్త‌లు మోదీ డౌన్ డౌన్‌.. బీజేపీ డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు.

లిక్కర్​ స్కామ్​లో ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఆ తర్వాత ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కవిత.. నేరుగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్​ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు బీఆర్​ఎస్​ లీడర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాగా, ఈ నెల 16వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు అందించినట్టు తెలుస్తోంది.

ఇక.. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు ఇతర నేతలంతా హైదరాబాద్​ బయలుదేరి రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement