Wednesday, April 24, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షమే: కేటీఆర్

ప్ర‌భ‌న్యూస్ : నేడు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరు రిసార్ట్ లో.. సిరిసిల్ల , కరీంనగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు ఈ నెల 10 న జరుగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై మంత్రి కేటీఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎల్.రమణ, టీ. భాను ప్రసాద్ రావు లు ఘన విజయం సాధిస్తారని … దాంట్లో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేసినారు.

కొంతమంది నాయకులు క్రాస్ ఓటింగ్ జరిగి గెలుస్తామని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీకి 994 ప్రజాప్రతినిధుల బలముందని ప్రజాప్రతినిధులంతా ఏకతాటిపై ఉన్నారని, వారంతా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొన్నారు. ప్రత్యర్ధులది దింపుడు కళ్ళెం ఆశ అని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి నిరాశ తప్పదని ఎద్దేవా చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement