Thursday, April 25, 2024

Big Breaking | ఎమ్మెల్యేల ఎర కేసు.. హైకోర్టు జడ్జిమెంట్​తో టేకోవర్ చేసిన సీబీఐ​

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనని హైకోర్టు పేర్కొంది. కేసుకు సంబంధించి 45 అంశాలను బేస్​ చేసుకుని సీబీఐకి కేసు అప్పగించినట్టు జడ్జిమెంట్​లో పేర్కొంది. కాగా, ఈ కేసు జడ్జిమెంట్​ కాపీ ఇవ్వాల సీబీఐకి అందింది. దీంతో ఈ కేసును సిట్​ నుంచి సీబీఐ టేకోవర్​ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్​ హౌస్​ ఎఫ్​ఐర్​ ప్రకారమే సీబీఐ ఎఫ్ఐఆర్​ నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక.. ఈ కేసుకు సంబంధించి పలు కీలకాంశాలను హైకోర్టు జడ్జి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్​ కోర్టుకు గోప్యంగా అందజేయాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్​ చేశారని తీర్పులో కోడ్​ చేసినట్టు తెలుస్తోంది. సీఎం ప్రెస్​ మీట్​ని కూడా కోడ్​ చేస్తూ తీర్పు ఆర్డర్​లో పేర్కొన్నట్టు సమాచారం. దీంతోపాటు సిట్​ ఎంక్వైరీపై కూడా హైకోర్టు పలు ప్రశ్నలను లేవనెత్తిందని, సిట్​ ఉనికినే ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement