Friday, April 19, 2024

‘మా’ ఎన్నికల్లో రోజా మద్దతు ఎవరికో తెలుసా?

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధానంగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్ల మధ్య పోటీ జరగనుంది. మా సభ్యులు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇరు ప్యానల్ల సభ్యులు కోరుతున్నారు. ఈ క్రమంలో సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా మా ఎన్నికలపై స్పందించారు. మా ఎన్నికల్లో తాను పాల్గొంటానని, కచ్చితం తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటానన్నారు.

‘మా’ మ్యానిఫెస్టోలను తాను చేశానని తెలిపారు. “మా” ఎవరు అభివృద్ది చేస్తారు అని తాను భావిస్తానో వారి ప్యానల్ కే నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. MAA ఎన్నికలు వాడిగా వేడిగా జరుగుతున్నాయన్న రోజా..  వివాదాల్లొకి తనను లాగొద్దని కోరారు. కాగా, అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: ఇండ్లు లేని వారికి రూ.5 లక్షలు.. తెలంగాణలో కొత్త పథకం!

Advertisement

తాజా వార్తలు

Advertisement