Sunday, September 24, 2023

డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు. 8నెంబర్లతో ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తే కేసు పెట్టడం లేదన్నారు. జై శ్రీరామ్ వాయిస్ రేస్ చేస్తే మాత్రం వెంటనే కేసు బుక్ చేస్తారన్నారు. అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదన్నారు. గన్ లైసెన్స్ అడుగుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. నా ప్రాణాలకు ముప్పు ఉన్నా గన్ లైసెన్స్ ఇవ్వకపోవడం దారుణమని లేఖలో తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement